కంచి మహాస్వామిగా పేరుగాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు మే, 20,1894 వ సంవత్సరములో దక్షిణ తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లుపురం గ్రామమునందు ఒక స్మార్త హొయసల కర్నాటక బ్రాహ్మణ కుటుంబములో మే 20, 1894 నాడు అనూరాధ నక్షత్రములో (చాంద్రమాసానుసారము) జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి మహాలక్ష్మీ, శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గార్లు. వారికి చిన్నతనములో పెట్టబడిన పేరు స్వామినాథన్. జిల్లా విద్యాధికారిగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి వారు రెండవ అబ్బాయి. వారి ఇలవేల్పు, కుంబకోణము దగ్గర్లోనున్న స్వామిమలై ఆలయము ప్రధాన దేవత ఐన స్వామినాథుని పేరు మీదుగా బాలుడికి స్వామినాథన్ అని నామకరణము చేసారు. స్వామినాథన్ దిండివనములో తన తండ్రి పనిచేస్తున్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం ఆరంభించారు. వారు చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకుని పలు పాఠ్యాంశాలలో రాణించారు. వారికి 1905లో ఉపనయనము జరిగింది. శివన్ సర్ గా పేరొందిన సదాశివ శాస్త్రిగారు స్వామినాథన్ కి అనుజులు. ఆబాలుడు 13వ ఏటనే సన్యాసదీక్ష పుచ్చుకొని కంచి కామ కోటి పీఠం అధిష్టించాడు. చంద్రశేఖ రేంద్ర స్వామి కేవలం పీఠాధిపతులే కారు. వారిలో ఒక రాజకీయవేత్త, చారిత్రక పరిశోధకుడు, ఒక శాస్త్రపరిశోధ కుడు, జ్యోతిశ్శాస్త్రవేత్తను, ఆధ్యాత్మిక తరంగాన్ని ఇలా ఒకటేమిటి ఎందరినో దర్శించవచ్చు. ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభాసామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితం అద్భుతం, అనితర సాధ్యం. నిండు నూరేళ్ళు విలక్షణమైన జీవితాన్ని గడిపి, పాదచారియై దేశమంతా సంచరిస్తూ ధర్మప్రభోదాలు సలిపి, అనేక దివ్యశక్తులు ప్రదర్శిస్తూ, సనాతన ధర్మపునరుద్ధరణకై జీవితాన్ని అంకితం చేసుకున్న మహాపురుషులు స్వామి. ఈయన 'నడిచే దేవుడి' గా ప్రసిద్ధికెక్కాడు.
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఎక్కడ జన్మించాడు?
Ground Truth Answers: దక్షిణ తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లుపురందక్షిణ తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లుపురందక్షిణ తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లుపురం
Prediction: